న్యూఢిల్లీ: దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia) అన్నారు. లిక్కర్ స్కామ్లో జైలు జీవితం అనుభవిస్తున్న ఆయన ఇవాళ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోదీ(PM Modi) తన విద్యార్హత(Educational Qualification)లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. హిందీ భాషలో రాసిన లేఖను సిసోడియా రిలీజ్ చేశారు. దేశ ప్రగతి కోసం ఓ విద్యావంతుడైన వ్యక్తి ప్రధాని కావాలని మాజీ డిప్యూటీ సీఎం తన లేఖలో తెలిపారు.
Jailed former Delhi deputy CM Manish Sisodia writes to PM Modi, raises questions on his education.
"For the progress of India, it is necessary to have an educated PM," Sisodia writes in his letter to the PM. pic.twitter.com/yV7peRjns3
— ANI (@ANI) April 7, 2023
ప్రధాని మోదీ విద్యార్హతలపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తక్కువగా చదువుకున్నారని, అలాంటి వ్యక్తి దేశానికి ప్రమాదకరమని సిసోడియా తన లేఖలో తెలిపారు. మోదీజీకి సైన్స్ అర్ధం కాదన్నారు. ఆయన విద్య యొక్క విలువ తెలియదన్నారు. గత కొన్నేళ్లలో దేశంలో సుమారు 60 వేల స్కూళ్లను మూసివేసినట్లు సిసోడియా ఆరోపించారు.
ప్రధాని ఎడ్యుకేషన్ గురించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కేసు వేశారు. అయితే ఆయనకు ఆ కేసులో కోర్టు 25వేల ఫైన్ వేసింది.