న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను అనర్హురాలిగా ప్రకటించిన అంశంలో రాజకీయ కుట్ర ఉన్నదని, దానిపై చర్చ చేపట్టాలని ఇవాళ రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధనకర్(Jagdeep Dhankhar), విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. విపక్ష సభ్యులను ఓదార్చే క్రమంలో చైర్మన్ జగదీప్ కొంత అసహనానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన తన చైర్ నుంచి లేచి.. సభ్యులకు దండం పెట్టి, సభ నుంచి వాకౌట్ అయ్యారు.
సాధారణంగా విపక్షాలు వాకౌట్ చేస్తుంటే, చైర్లో కూర్చుండే చైర్మన్ జగదీప్.. ఇవాళ విన్నూత రీతిలో విపక్ష సభ్యులపై తన ఆక్రోశాన్ని చూపించారు. కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేశ్ నవ్వుతున్న తీరును ధన్కర్ తప్పుపట్టారు. నీ ప్రవర్తన నాకు తెలుసన్నారు. చైర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తనను కాదు.. చైర్పర్సన్ పోస్టును ఛాలెంజ్ చేస్తున్నారని, చైర్లో కూర్చున్న వ్యక్తి సమర్థుడు కాడన్న ఉద్దేశంతో విపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నట్లు ధన్కర్ ఆరోపించారు.
జైరాం రమేశ్ దిక్కుకు చూస్తూ.. ఇప్పుడు తనకు ఆప్షన్ లేదని, ఇవాళ జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే, ఇక్కడ కూర్చునే పొజిషన్లో తాను లేనట్లు అనిపిస్తోందని జగదీప్ తెలిపారు. ఆ తర్వాత లేచి నిలబడ్డ ఆయన, చేతులు జోడించి దండం పెట్టి, సభ నుంచి వాకౌట్ చేశారు. మళ్లీ కాసేపయ్యాక వచ్చిన ధన్కర్.. సభలో వాతావరణం ఆమోదయోగ్యంగా లేదన్నారు. తనకు తాను ఆత్మపరిశీలన చేసుకున్నానని, ఆ తర్వాతే ఫ్లోర్ లీడర్ల భేటీకి పిలుపు ఇచ్చినట్లు చెప్పారు.
ఫోగట్ పై వేటు పడానికి కారణం ఏంటో తెలియని ఖర్గే డిమాండ్ చేశారు.
Shameful behavior by @Jairam_Ramesh led to Dhankhar Sahib ji leaving the chair!
Congress leaders lack even basic decency in Parliament and then they have the audacity to blame others. pic.twitter.com/wWyF1mcrie
— Satya Kumar Yadav (@satyakumar_y) August 8, 2024