పూరీ: ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథుని రథయాత్ర రెండో రోజు సోమవారం వైభవోపేతంగా జరిగింది. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిపోయింది. భక్తులు 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా దేవాలయం వైపు రథాలను లాగుతూ ఆనంద పరవశులయ్యారు. రథయాత్రలో పాల్గొనేందుకు విదేశీ భక్తులు కూడా తరలి వచ్చారు. వీరిలో రష్యన్లు ఎక్కువగా ఉన్నారు.
మరోవైపు రథయాత్ర సందర్భంగా జరిగిన వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం మోహన్ చరణ్ నష్టపరిహారం ప్రకటించారు. గాయపడినవారికి అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు.