e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, November 30, 2021
Home News Maharashtra : గవర్నర్‌-ముఖ్యమంత్రి మధ్య మళ్లీ మొదలైన జగడం

Maharashtra : గవర్నర్‌-ముఖ్యమంత్రి మధ్య మళ్లీ మొదలైన జగడం

ముంబై : (Maharashtra) పశ్చిమ బెంగాల్‌లో మాదిరిగానే మహారాష్ట్రలో కూడా గవర్నర్‌-ముఖ్యమంత్రి మధ్య జగడం నడుస్తున్నది. ఒకరు ఒకటి చెప్తే.. ఇంకొకరు అట్లాకాదంటారు.. ఇది రెండు రాష్ట్రాల్లో నడుస్తున్న జగడం కథ. ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్‌ నడుచుకోవాల్సి ఉండగా.. తాను చెప్పినట్లే ముఖ్యమంత్రి నడుచుకోవాలంటూ గవర్నర్‌ కొత్త భాష్యం చెప్తున్నారు. మహారాష్ట్రలో ఇద్దరి మధ్య పొసగడం లేదని గత కొన్నాళ్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

మహిళల రక్షణ, భద్రతకు సంబంధించి చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ లేఖ రాశారు. ఇటీవల జరిగిన సకినాక లైంగిక దాడి, హత్య కేసు నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో గవర్నర్ సూచించారు. రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రతపై గవర్నర్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

గవర్నర్‌ లేఖపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. ఈ సమస్య జాతీయ సమస్య ఐనందున మహిళా రక్షణ, భద్రత అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా నాలుగు రోజులపాటు సమావేశమైతే బాగుంటుందని ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తే బాగుంటుందని చురక అంటించారు. సకినాక సంఘటన జరిగిన అనంతరం చాలా మంది మిమ్మల్ని కలిసి సూచించిన మీదటే మీరిలా లేఖ రాశారని భావిస్తున్నానని సీఎం తెలిపారు. ఘటన జరిగిన తర్వాత 10 నిమిషాల్లోనే పోలీసులు చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారని, అన్ని పోలీస్‌ స్టేషన్లో నిర్భయ బృందాలను కూడా నెలకొల్పిన విషయం మీకు తెలియంది కాదని చెప్పారు.

గవర్నర్‌కు రాసిన నాలుగు పేజీల లేఖలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ప్రతిపక్షం లేవనెత్తినప్పుడు.. అదే సమస్య మీరు లేవనెత్తినట్లయితే, అది మరింత అనుకోని వివాదానికి దారితీస్తుందని.. అలాగే, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ఢిల్లీలో మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున అక్కడే చర్చిస్తే బాగుంటుందని లేఖలో చురక అంటించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

తస్వీర్‌ స్క్రీనింగ్‌కు ఎంపికైన ‘నాను లేడీస్‌’.. కన్నడ లెస్బియన్‌ లవ్‌ స్టోరీ

మతపరమైన నిర్మాణాల రక్షణ బిల్లును తెచ్చిన కర్నాటక

శరద్‌ పవార్‌ వెన్నుపోటుదారు: అనంత్‌ గీతే

జలాలాబాద్‌లో 35 మంది తాలిబాన్లు మృతి : ఐసిస్‌ ఖోరాసన్

పాక్‌లో సివిల్స్‌కు ఎంపికైన హిందూ యువతి

వృద్ధులను వేధిస్తున్న మతిమరుపు సమస్య.. ఎందుకలా?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement