IT Raids | తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ ఇంటిపై ఐటీ దాడులు
తమిళనాడులో (Tamil Nadu) ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
చెన్నై: తమిళనాడులో (Tamil Nadu) ఆదాయపు పన్ను శాఖ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. రాష్ట్ర విద్యుత్, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై (Chennai), కరూర్ (Karur), కోయంబత్తూర్ (Coimbatore)తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.
కాగా, మంత్రి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడుల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కరూర్లో ఆదాయపు పన్ను అధికారులను స్థానికులు, డీఎంకే (DMK) కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ మహిళా అధికారిని మంత్రి నివాసంలోకి వెళ్లకుండా అడ్డగించారు. అధికారులకు సంబంధించిన వాహనాలపై దాడిచేశారు.

గత నెల 24న కూడా ఐటీ అధికారులు తమిళనాడులో దాడులు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్క్వేర్కు చెందిన పలు ఆస్తులు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కంపెనీ ఎదగడానికి అధికార డీఎంకే అగ్రనేతలు సహకరించినట్లు ఆరోపణలున్నాయి.https://twitter.com/ANI/status/1661936882933194755?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Chennai
- Coimbatore
- DMK
- it raids
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

