ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి నేతల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ కాకపోతే ఈడీ, అదీకాకపోతే సీబీఐ అన్నట్లుగా పాలక కూటమికి చెందిన చిన్న పెద్ద అని తేడాలేకుండా నాయకుల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థలు వరుసగా సోదాలు నిర్వహిస్తూ అదుపులోకి తీసుకుంటున్నాయి. బుధవారం రాత్రి ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శివసేన నాయకుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ యశ్వంత్ జాదవ్ ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నది. శుక్రవారం ఉదయాన్నే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న యశ్వంత్ జాదవ్ ఇండ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
#UPDATE | Maharashtra: Income Tax dept conducts raid at the second residence of Shiv Sena corporator & Standing Committee chairperson of BMC, Yashwant Jadhav, in Mumbai.
Visuals from Copper Castle, Mazgaon pic.twitter.com/lQZZXek5hQ
— ANI (@ANI) February 25, 2022
కాగా, అధికార పార్టీ నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తప్పుబట్టారు. ఇవి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ గవర్నర్ నివాసాలను, జాతీయ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్నదే దీనికి ఉదాహరణ అని చెప్పారు. దేశంలో ఎలాంటి ప్రజాస్వామ్యం నడుస్తున్నదని ఆయన ప్రశ్నించారు.
This is very disgusting politics. When you lose elections….Central agencies & Governor House are being misused in the country – look at what is happening in West Bengal. What kind of democracy is being run in our country?: Sanjay Raut, Shiv Sena on NCP leader & min Nawab Malik pic.twitter.com/Ya1sefQGA1
— ANI (@ANI) February 25, 2022
గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని బంధువులతో కలిసి అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. దావూద్, అతని బంధువులపై ఇప్పటికే నమోదు చేసిన మనీ ల్యాండరింగ్ కేసుతో మాలిక్‌కు సంబంధం ఉందని ఆరోపించింది.
బుధవారం ఉదయం 6 గంటలకే ఈడీ అధికారులు నవాబ్ మాలిక్ ఇంటికి వెళ్లారు. 8 గంటలకు ఆయన్ను ముంబైలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆరు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. నవాబ్ మాలిక్‌కు కోర్టు మార్చి 3 వరకు ఈడీ కస్టడీ విధించింది. తాము అడిగిన ప్రశ్నలకు మాలిక్ నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకోజూశారని ఈడీ అధికారులు చెప్పారు. దావూద్, ముంబై పేలుళ్లలో దోషులతో నగదు లావాదేవీలు జరిపినందున ఆయనను ప్రశ్నించాల్సి ఉందన్నారు.