రాంచి, డిసెంబర్ 7: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు బంధువుల ఇళ్లు, ఇతర సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండు రోజుల పాటు దాడులు జరిపి రూ.150 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని బౌద్ధ్ డిస్టిలరీ ఆవరణలో పట్టుబడ్డ కట్టల కట్టల సొమ్మును లెక్కపెట్టడానికి ఐటీ అధికారులు పలు కౌంటింగ్ మిషన్లను తెచ్చారు. అలాగే సాహుకు చెందిన ఒడిశాలోని లోహర్డాగ, రాంచీ, పశ్చిమ బెంగాల్‌లోని సంస్థలపై దాడులు జరిపి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ధీరజ్ సాహు రెండు సార్లు కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.