Campus Placements | న్యూఢిల్లీ, మే 12: దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా భావించే ఐఐటీల్లో చదివే విద్యార్థులకు కొలువులు లభించడం కష్టమవుతున్నది. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ప్లేస్మెంట్ సీజన్ త్వరలో ముగియనున్నది. అయితే ప్లేస్మెంట్ గణాంకాలను చూస్తే విద్యార్థులకు నిరాశే ఎదురవుతున్నది. క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం దరఖాస్తు చేసుకొన్న వారిలో చాలా మందికి ఇప్పటికీ ఉద్యోగం లభించకపోవడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది. సమాచార హక్కు చట్టం కింద ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్మెంట్ వివరాలను సేకరించారు.
