IT Employees | హైదరాబాద్, ఫిబ్రవరి 28: రాత్రి, పగలు తేడా లేకుండా గంటల కొద్దీ పని.. పైగా డెడ్ లైన్లతో తీవ్రమైన పని ఒత్తిడి.. వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన తిండి.. ఇవన్నీ కలిసి ఐటీ ఉద్యోగులను రోగాల ఊబిలోకి నెడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సాయంతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.