తిరువనంతపురం: చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత ఇస్రో భారత వ్యోమగాముల్ని 2040కల్లా చంద్రుడిపైకి పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. దీనికంటే ముందు గగన్‌యాన్ మిషన్ ద్వారా 2025లో అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపుతామని, ఇందుకోసం చేపట్టిన మానవ రహిత టెస్ట్ ఫ్లైట్స్ సక్సెస్ అయ్యాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ‘మనోరమ ఇయర్‌బుక్-2024’కు రాసిన వ్యాసంలో ఆయన పై విషయాల్ని వెల్లడించారు.