న్యూఢిల్లీ, జూలై 8: భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు చేపడుతున్న ‘గగన్‌యాన్’ మిషన్‌కు సంబంధించి ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్(ఎస్‌ఎంపీఎస్)కు సంబంధించి రెండు హాట్ టెస్ట్‌లను విజయవంతంగా నిర్వహించింది. జూలై 3న తమిళనాడులోని మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ హాట్ టెస్ట్‌లు చేపట్టినట్టు ఇస్రో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.