Chandrayaan-3: భూమి, చంద్రున్ని ఫోటో తీసిన చంద్రయాన్-3.. పిక్స్ షేర్ చేసిన ఇస్రో
Chandrayaan-3: చంద్రయాన్-3లో ఉన్న కెమెరాలు.. భూమిని, చంద్రున్ని ఫోటో తీశాయి. ల్యాండర్ ఇమేజ్ భూమిని ఫోటో తీయగా, ల్యాండర్ హారిజంటల్ వెలాసిటీ కెమెరాతో చంద్రున్ని ఫోటో తీశారు. ఆ రెండు ఫోటోలను ఇవాళ ఇస్రో రిలీజ్ చేసింది.
హైదరాబాద్: కొన్ని రోజుల క్రితం చంద్రయాన్-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ స్పేస్‌క్రాఫ్ట్ తీసిన ఫోటోలను ఇవాళ ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రయాన్-3లో ఉన్న ల్యాండర్ ఇమేజ్ కెమెరాల నుంచి భూమిని ఫోటో తీశారు. ఇక ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన తర్వాత చంద్రుడి ఫోటోను కూడా తీసింది. ల్యాండర్ హారిజంటల్ వెలాసిటీ కెమెరా ఆ ఫోటోను క్లిక్ అనిపించింది. చంద్రయాన్-3 విజయవంతంగా ఆగస్టు 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆగస్టు 23వ తేదీన ల్యాండర్ చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి.
Chandrayaan-3 Mission:
🌎 viewed by
Lander Imager (LI) Camera
on the day of the launch
&
🌖 imaged by
Lander Horizontal Velocity Camera (LHVC)
a day after the Lunar Orbit InsertionLI & LHV cameras are developed by SAC & LEOS, respectively https://t.co/tKlKjieQJS… pic.twitter.com/6QISmdsdRS
— ISRO (@isro) August 10, 2023
చంద్రుడి ఫోటోలో క్రాటర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎడ్డింగ్టన్, అరిస్టార్‌చస్, పైతాగరస్, ఓసియన్ ప్రొసెల్లరమ్ లాంటి బిల్హాలు ఆ పిక్‌లో కనిపించాయి. చంద్రుడి ఉత్తర ద్రువంలో ఉన్న బిల్వాల్లో.. ప్రొసెల్లరమ్ చాలా పెద్దది. అది సుమారు 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాదాపు 4 లక్షల చదరపు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

