న్యూఢిల్లీ: ఏక్సియమ్-4 మిషన్ ద్వారా రోదసిలోకి వెళ్తున్న శుభాంశు శుక్లా, అక్కడ వోయేజర్ టార్డిగ్రేడ్స్ (నీటి ఎలుగుబంట్లు)పై ప్రయోగాలు చేయబోతున్నారు. కేవలం 0.3 మి.మీ. నుంచి 0.5 మి.మీ పొడవు ఉండే జీవులివి.
భూమి, సముద్రాల్లో, ధ్రువపు మంచులో, శూన్యం, రేడియేషన్, వేర్వేరు ఉష్ణోగ్రతలు గల వాతావరణాల్లో జీవించగలవు. ఇవి రోదసిలో ఎలా జీవిస్తాయనే అంశంపై ఇస్రో పరిశోధన చేయనున్నది. ఇవి గుడ్లు పెట్టి, ఎలా పొదుగుతాయి? అనే అంశాలను వ్యోమగాములు పరిశీలిస్తారు.