ISRO Chief | రాకెట్లు, శాటిలైట్లే కాదు..అంతరిక్షంలో అపార అవకాశాలు : ఇస్రో చీఫ్
భారత అంతరిక్ష రంగంలో అప్లికేషన్, సర్వీసులు, తయారీ విభాగాల్లో అపార అవకాశాలున్నాయని ఇస్రో చైర్మన్ (ISRO Chief) ఎస్ సోమనాధ్ బుధవారం పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష రంగంలో అప్లికేషన్, సర్వీసులు, తయారీ విభాగాల్లో అపార అవకాశాలున్నాయని ఇస్రో చైర్మన్ (ISRO Chief) ఎస్ సోమనాధ్ బుధవారం పేర్కొన్నారు. మనం అమృత్ కాలంలో అడుగుపెట్టిన క్రమంలో మన ఎకానమీలో స్పేస్ రంగం వాటా పెరిగిందని స్పష్టం చేశారు. ఇది కేవలం రాకెట్ల తయారీ, శాటిలైట్ల నుంచే కాకుండా భారత్‌లో అప్లికేషన్ల నిర్మాణం, సర్వీసులు, తయారీ విభాగాల నుంచి అపార అవకాశాలు, సామర్ధ్యం అందివస్తున్నాయని తెలిపారు.
ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఐమా) 50వ జాతీయ నిర్వహణా సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సోమనాధ్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్పేస్ రంగం ద్వారా చేపడుతున్న హైపర్‌లోకల్ వాతావరణ అప్డేట్ సేవలు, మ్యాప్ సర్వీసులు, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ అప్లికేషన్స్ వంటివి ముందుకు వచ్చిన తీరును ఉదహరించారు.
ఈ దిశగా మనం సరైన ఇకోసిస్టమ్‌ను సృష్టిస్తున్నామని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. ఇక భారత అంతరిక్ష ఆర్ధిక వ్యవస్ధ మొత్తం జీడీపీలో 1.8 శాతంగా ఉంటుందని అంచనా. అంతరిక్ష రంగంలో మైనింగ్ రేర్ మెటల్స్, మినరల్స్, స్పేస్ రియల్ ఎస్టేట్, మేడిన్ స్పేస్ ప్రోడక్ట్స్ వంటి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
Read More :
Salt usage | ఉప్పు తెగ తింటున్న భారతీయులు.. గుండెపోటు, స్ట్రోక్స్, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

