న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రవాద దాడి సృష్టించిన జ్వాలలు రగులుతుండగానే నిఘా వర్గాలు ఓ హెచ్చరిక చేశాయి. జమ్ముకశ్మీరులోని స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్), దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. పర్యాటకులు, స్థానికేతరులు, కశ్మీరీ పండిట్లు, పోలీసులు, రైల్వే ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ముఖ్యంగా శ్రీనగర్, గందర్బల్ జిల్లాల్లో ఉన్నవారిపై, అదేవిధంగా, రైలు పట్టాలు, రైల్వే శాఖకు చెందిన నిర్మాణాలు వంటి వాటిపై దాడులు జరగవచ్చునని తెలిపాయి.