Beer | న్యూఢిల్లీ: బీర్, విస్కీ, బ్రాందీ..మొదలైనవి (ఆల్కహాల్) శాకాహారమా? మాంసాహారమా? అన్నదానిపై సందేహాలు పెరిగాయి. సాధారణంగా బార్లీ, గోధుమ, మొక్కజొన్న, బియ్యం, ద్రాక్ష సహా వివిధ రకాల పండ్ల నుంచి బేవెరెజెస్ కంపెనీలు మద్యాన్ని తయారుచేస్తున్నాయని అనుకుంటారు. అయితే, ఇది పూర్తి నిజం కాదని నివేదికలు హెచ్చరించాయి. కొన్ని రకాల బీర్లు శాకాహారం కాదని తేల్చాయి.
జంతువుల నుంచి ఉత్పత్తి చేసిన ఐజిన్గ్లాస్, జిలెటిన్ వంటి పదార్థాలను బీరు, వైన్లలో వాడుతున్నారని, ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ పద్ధతులపై శాకాహారులు ఆరా తీయాలని నివేదికలు హెచ్చరించాయి. జంతు ఉత్పత్తులతో తయారైన మద్యం వల్ల శాకాహారుల జీవన శైలి ప్రమాదంలో పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశాయి.