COVID | న్యూఢిల్లీ : మన దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య తగ్గించి చూపించిన ట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. 2021లో 3.32 లక్షల మంది కొవిడ్‌తో మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది.
బుధవారం విడుదలైన సివి ల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించి చూపించినట్టు స్పష్టమవుతున్నది. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ డ్యాష్‌బోర్డ్‌లో కొవిడ్‌తో 5.33 లక్షల మంది మరణించినట్టు తెలిపింది. పరిశోధకు ల అంచనా ప్రకారం 4-12 రెట్లు ఎక్కువ! సీఆర్ఎస్ 2021 లెక్కల ప్రకారం 2020లో 81.15 లక్షల మంది మరణించారు, 2021లో 1.02 కోట్ల మరణాలు నమోదయ్యా యి. అంటే 2020లో కన్నా 2021లో ఈ సంఖ్య 21 లక్షలు ఎక్కువ.