ముంబై, జనవరి 9: మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో చీలిక తప్పదా? విడిపోయిన రెండు నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు ఏకమవుతాయా? శరద్ పవార్, అజిత్ పవార్ ఏకమవుతారా? అన్న చర్చలు ఇప్పుడు ఊపందుకున్నాయి. రెండు పార్టీలు తిరిగి ఒకటి కావాలని తన పార్టీ, తన అంకుల్ పార్టీల కార్యకర్తలు కోరుతున్నారని, పవార్ కుటుంబంలో ఉన్న ఒత్తిళ్లు అన్నీ తొలగిపోయాయని, ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ఉన్నాయని ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం మీడియాతో పేర్కొనడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
ఈ నెల 15న మున్సిపల్ ఎన్నికలు, ప్రతిష్ఠాత్మకమైన బీఎంసీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, రెండు పార్టీలు కలిసిపోయిన విషయాన్ని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా నిర్ధారించారు.