న్యూఢిల్లీ, జూన్ 24: నీట్, నెట్ పరీక్షల్లో అక్రమాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈనేపథ్యంలో సివిల్స్ పరీక్షలను నిర్వహించే యుపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.
వివిధ రకాల పరీక్షల నిర్వహణలో ఫేసియల్ రికగ్నేషన్, కృత్రిమ మేథ ఆధారిత టెక్నాలజీ కలిగిన ‘సీసీటీవీ’ నిఘా వ్యవస్థను ఉపయోగించనున్నట్టు తెలిపింది.