ముంబై: ఐరన్ రాడ్లతో వెళ్తున్న టెంపో ఒక రోడ్డు మలుపు వద్ద సడన్‌గా ఆగింది. ఆ మలుపులోకి తిరిగిన కారులోకి ఆ ఇనుప రాడ్లు చొచ్చుకెళ్లాయి. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. (Iron rods tear through car) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలున్న ఒక కుటుంబం కారులో ప్రయాణించింది.
కాగా, పూణె-బెంగళూరు హైవేలోని కనేరివాడి ఫాటా సమీపంలో ఆ కారు ఒక రోడ్డును క్రాస్ చేసింది. ఇనుప రాడ్ల లోడ్‌తో వెళ్తున్న టెంపో డ్రైవర్ దీనిని గమనించి సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ టెంపోపై వదులుగా కట్టిన ఐరాన్ రాడ్లు జారిపడ్డాయి. టెంపో ముందు మెల్లగా వెళ్తున్న కారు ముందరి అద్దంలోకి అవి చొచ్చుకెళ్లాయి.
మరోవైపు ఇది చూసి అక్కడున్న స్థానికులు షాక్ అయ్యారు. పరుగున ఆ కారు వద్దకు వెళ్లి పరిశీలించారు. అదృష్టవశాత్తు ఆ కారులోని ముందు సీట్లలో ఉన్న ఇద్దరితోపాటు వెనుకున్న వారికి ఏమీ కాలేదు. దీంతో సహాయం కోసం వచ్చిన స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇరువర్గాల రాజీ వల్ల పోలీసులకు ఫిర్యాదు అందలేదు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియలో వైరల్ అయ్యింది.
काळ आला पण… कोल्हापुरातील अपघाताची थरारक दृश्यं#kolhapur #marathinews pic.twitter.com/lRDjMLOQhD
— News18Lokmat (@News18lokmat) April 22, 2025