
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆదాయానికి రైల్వే శాఖ గండికొట్టింది. ఆన్లైన్లో జరిగే టికెట్ బుకింగ్స్ ద్వారా లభించే ఫీజు ఆదాయంలో సగం తమకు చెల్లించాలని రైల్వే శాఖ ఆదేశించింది. ఇప్పటివరకూ టికెట్ ఛార్జీ మొత్తం రైల్వే శాఖకు బదిలీ అవుతుండగా, టికెట్ బుకింగ్‌కు వసూలుచేసే సర్వీసు ఫీజును ఐఆర్సీటీసీ తీసుకుంటున్నది. తాజా ఆదేశాలతో ఇక నుంచి ఆదాయాన్ని 50:50 నిష్పత్తిలో రైల్వేశాఖతో షేర్చేసుకోనున్నట్లు స్టాక్ ఎక్సేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో ఐఆర్సీటీసీ గురువారం తెలిపింది. ఈ రెవిన్యూ షేరింగ్ ఒప్పందం నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.