Iran | టెహ్రాన్: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడికి సిద్ధమవుతున్నదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను ఎదుర్కోవడంలో భాగంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగినట్టు కనిపిస్తున్నది.
ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు మధ్యప్రాచ్యంలో యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్స్‌ను మోహరిస్తున్నది. కాగా, ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం శుక్రవారం సూచించింది.