మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా కేసులో లోకాయుక్త పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. గురువారం మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) మాజీ కమిషనర్ పీఎస్ కాంతరాజును లోకాయుక్త పోలీసులు విచారించారు.
సిద్ధరామయ్య భార్య పార్వతికి ప్లాట్లు కేటాయించిన సమయంలో కాంతరాజు ముడా కమిషనర్గా పని చేశారు. స్థల కేటాయింపు నిర్ణయం ముడా బోర్డు సమావేశంలో సమష్ఠిగా తీసుకున్నదని, ఇదే విషయాన్ని విచారణ అధికారికి తెలియజేసినట్టు కాంతరాజు తెలిపారు. ఈ కేసులో ఈడీ సైతం విచారణ జరుపుతున్నది.