న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్(Parliament)లో భద్రతా ఉల్లంఘన ఘటన జరిగింది. ఓ వ్యక్తి పార్లమెంట్ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న సెక్యూర్టీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న చెట్టును ఎక్కి అతను.. పార్లమెంట్ హైజ్ లోపలికి ప్రవేశించాడు. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది.
రైల్ భవన్ దిక్కున ఉన్న గోడ నుంచి దూకిన అతను పార్లమెంట్ బిల్డింగ్లో ఉన్న గరుడ గేటు వద్దకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన వ్యక్తిని పట్టుకుని దర్యాప్తు చేపడుతున్నారు.