Viral Video | సగటు భారతీయుడికి పప్పన్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో శుభ్రంగా వండిన పప్పును వేడి అన్నంలో కాస్తంత నెయ్యి కలిపి లాగిస్తే ఆ మజా వేరు. ఇక రైస్ ఉంటే మనవాళ్లకు చాలు అందులో ఏ డిష్ అయినా కలిపి లాగించేస్తుంటారు. టమాటా రైస్, ఆలూ రైస్ వంటి పలు వెరైటీలనూ పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా ఆరగిస్తారు.
అయితే విచిత్ర ఫుడ్ కాంబినేషన్స్ నెట్టింట సందడి చేస్తుండగా తాజాగా చాక్లెట్ వెజిటబుల్ రైస్ బౌల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కాట్ హెంజ్పీటర్ అనే వ్లాగర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ విచిత్ర ఫుడ్ కాంబో తయారీతో పాటు ఆయన ఈ డిష్‌ను టేస్ట్ చేసేందుకు సాహసించడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఇక టేస్ట్ చేసిన తర్వాత ఈ డిష్‌కు అతడు 10కి గాను 8 స్కోర్ రేటింగ్ ఇస్తాడు. ఈ ఫుడ్ కాంబో రెసిపీపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అసలు ఏమైంది నీకని ఓ యూజర్ కామెంట్ చేయగా, దీన్ని చూస్తేనే నాకు ఫుడ్ పాయిజనింగ్ అవుతోందని మరో యూజర్ భగ్గుమన్నారు. ఇక ఈ వీడియోకు 3 కోట్లపైగా వ్యూస్ లభించాయి.
Read More :
IPL 2024 | పంత్ తొందరెందుకు.. ఆలస్యమైనా పర్లేదులే..!