న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బాస్మతేతర బియ్యం ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించడంతో దీని ప్రభావం అంతర్జాతీయంగా పడింది. ఒక్కసారిగా బియ్యం ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల ఆగస్టు నెలలో దాదాపు 9.8 శాతం ఉన్నదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. గత 15 ఏండ్లలో ఇదే అధిక పెరుగుదల అని వెల్లడించింది. భారత్లో బియ్యం ధరల పెరుగుదలకు అడ్డుకట్టవేయడానికి జూలైలో ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకునే దాదాపు 40కిపైగా దేశాలపై ప్రభావం పడింది.