న్యూఢిల్లీ: పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) నిరుటి మాదిరిగానే యథాతథంగా కొనసాగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28న జరిగే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుంది.
గత ఏడాది ఈ రేటు 8.25 శాతం అనే సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం తాలూకు ఆదాయ, వ్యయాలను ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ఖాతాల కమిటీ సమీక్షించి, ఓ వడ్డీ రేటును సూచిస్తుంది. ఈ రేటును కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాలి.