న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశంలో 2026 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామని ఇంటర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ గురువారం వెల్లడించింది. ఇండియాలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఈ సంస్థ భాగస్వామిగా ఉంది.
ఈ ఈ-ఎయిర్ క్రాఫ్ట్‌లో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చొనేందుకు అవకాశం ఉంటుంది. కారులో 60-90 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా 7 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.