న్యూఢిల్లీ: చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్ ఈ సంవత్సరం మరో 24 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సంస్థ మొత్తం శ్రామిక శక్తిలో ఈ సంఖ్య పావు వంతు ఉంటుంది. మరోవైపు జర్మనీ, పొలెండ్లో ప్రధాన విస్తరణ ప్రాజెక్టులను ఆ కంపెనీ రద్దు చేసుకొంది. కంపెనీ వ్యయ నిర్వహణ తగ్గించడానికి సీఈవో లిప్-బూ టన్ తీసుకుంటున్న చర్యల్లో ఇవి భాగమని చెప్తున్నారు.
భారీగా ఉద్యోగులను తొలగించాలన్న నిర్ణయం కఠినమైనదైనప్పటికీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన నిర్ణయమని టన్ దాన్ని అభివర్ణించారు. ప్రతి పెట్టుబడిని ఆర్థిక ప్రయోజన కోణంలో చూడాలని లిప్-బూ టన్ సంస్థ ఉద్యోగులకు ఇటీవల లేఖ రాశారు. మరోవైపు ఉద్యోగులందరూ సెప్టెంబర్ నుంచి ఆఫీస్ నుంచే పని చేయాలని ఆయన ఆదేశించారు.