ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో మైలు రాయికి చేరుకునేందుకు సిద్ధమైంది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వందో ప్రయోగం చేపట్టనున్నది. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. ఈ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని భారత్ స్పేస్‌లోకి పంపనున్నది. అయితే, జీఎస్ఎల్వీ-15 రాకెట్‌తో ఎన్వీఎస్ ఉపగ్రహం అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యిందని ఇస్రో ఆదివారం పేర్కొంది.
📸 GSLV-F15 integration complete! Take a sneak peek at the incredible teamwork behind this mission:
Countdown: Less than 3 days to launch! Join us as we unlock new frontiers. 🚀
More information at: https://t.co/ttZheUYypF#GSLV #NAVIC #ISRO pic.twitter.com/UNlMRvV0nG
— ISRO (@isro) January 26, 2025
ఈ విషయాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొంది. ప్రయోగం సందర్భంగా కౌంట్‌డౌన్‌లో మూడురోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని ఇస్రో పేర్కొంది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని భూస్థిర లక్ష్యలో ప్రేవశపెడుతుందని పేర్కొంది. షార్‌లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఉపగ్రహం సెకండ్ జెనరేషన్ శాటిలైట్ కాగా.. ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఇది ఎన్వీఎస్-02 ఉపగ్రహం ఎన్వీఎస్ సిరీస్‌లో రెండో ఉపగ్రహం. ఎల్1, ఎల్5, ఎస్ బ్యాండ్లలో నావిగేషన్ పేలోడ్లను.. అలాగే తొలితరం ఉపగ్రహం ఎన్వీఎస్-01లో ఉన్నట్లుగానే సీబ్యాండ్లో రేజింగ్ పేలోడ్స్ ఉంటాయి. నావిక్ (NavIC) అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ.
🔍 The GSLV-F15, a powerhouse of India’s launch vehicles, is ready to soar!
Equipped with advanced cryogenic technology, it will carry the NVS-02 satellite into orbit.
Stay with us as we prepare for this monumental launch! 🌠
More information at: https://t.co/ttZheUYypF… pic.twitter.com/l9aKTi2XyQ
— ISRO (@isro) January 25, 2025
భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం. కొత్త శాటిలైట్‌తో దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్లో రూపొందించగా.. ఇతర శాటిలైట్ సెంటర్లు సహకారం అందించాయి. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ జీఎస్ఎల్వీ సిరీస్‌లో 17వది కావడం విశేషం. దేశీయ క్రయోజెనిక్ స్టేజ్ కలిగిన 11వ రాకెట్. ఈ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ఇస్రో ప్రవేశపెడుతుంది.