న్యూఢిల్లీ: నౌకాదళ సామర్థ్యం మరింత పెరిగింది. అధునాతన సర్వే నౌక ఐఎన్ఎస్ ఇక్షక్ గురువారం నేవీలో చేరింది. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో జలప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
దీనిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. 80 శాతం స్వదేశీ ఉత్పత్తులనే ఇందులో వినియోగించారు. ఇక్షక్ చేరికతో సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడింది.