న్యూడిల్లీ: పాకిస్థాన్‌తో భారత్ సంబంధాలు, వ్యవహారాలు కచ్చితంగా ద్వైపాక్షికంగానే ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. చాలాకాలంగా జాతీయ ఏకాభిప్రాయం మేరకు ఇదే విధానం కొనసాగుతున్నదని, ఇందులో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్ విషయానికి వస్తే చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలిపెట్టడమేనని అన్నారు.