పాట్నా: దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు జరిగాయి. (Firing At Durga Puja Pandal) బైక్‌లపై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మండపం వద్దకు చేరుకున్నారు. బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అర్హాలోని దుర్గా పూ.జా పండల్ వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైకులపై వచ్చారు. అక్కడున్న వారిపై గన్స్‌తో కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే పండల్ వద్దకు చేరుకున్నారు. కాల్పుల్లో గాయపడిన వారిని 19 ఏళ్ల అర్మాన్ అన్సారీ, 26 ఏళ్ల సునీల్ కుమార్ యాదవ్, 25 ఏళ్ల రోషన్ కుమార్, సిపాహి కుమార్‌గా గుర్తించారు. అర్మాన్ వీపు, సునీల్ ఎడమ చేయి, రోషన్ కుడి మోకాలి కింద, సిపాహి నడుముపై కాల్పుల గాయాలయ్యాయి. వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కాల్పుల ప్రాంతం నుంచి రెండు బుల్లెట్ కాట్రిడ్జ్‌లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు ఎవరు, ఎందుకు జరిపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.