IndiGo | మద్యం మత్తులో విమానం ఎమర్జెన్సీ డోర్ తీయబోయిన ప్రయాణికుడు.. సీఐఎస్ఎఫ్ పోలీసులకు పట్టించిన సిబ్బంది
విమానాల్లో తాగుబోతుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాగిన మైకంలో తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో (Drunk Passenger) విమానం ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తీయడానికి ప్రయత్నించాడో ఘనుడు.
న్యూఢిల్లీ: విమానాల్లో తాగుబోతుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాగిన మైకంలో తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా మద్యం మత్తులో (Drunk Passenger) విమానం ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తీయడానికి ప్రయత్నించాడో ఘనుడు.. అయితే సిబ్బంది గమనించడంతో ప్రమాదం తప్పింది. గమ్యస్థానం చేరిన తర్వాత ప్రబుద్ధుడిని పోలీసులకు పట్టించిన ఘటన ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం చోటచేసుకున్నది.
శుక్రవారం ఉదయం ఇండిగో (IndiGo) ఎయిర్లైన్స్కు చెందిన 6ఈ308 విమానం న్యూఢిల్లీ నుంచి బెంగళూరు (Delhi-Bengaluru) వస్తున్నది. ఉదయం 7.56 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫ్లాప్ తీయడానికి ప్రయత్నించాడు. అయితే గమనించిన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. విషయాన్ని ఫ్లైట్ క్యాప్టెన్కు తెలియజేశారు. అయితే విమానం గమ్యస్థానం (బెంగళూరు) చేరుకున్న తర్వాత అతడని సీఐఎస్ఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

