ఢిల్లీ : భారత టాప్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ చికున్ గున్యా బారినపడ్డాడు. దీంతో కొద్దిరోజుల పాటు ఆట కు దూరమవుతున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని సోమవారం అతడే స్వయంగా ‘ఎక్స్’ ఖాతా వేదికగా వెల్లడించాడు. ‘దురదృష్టవశాత్తూ చికున్ గున్యా బారినపడటంతో నా ఆరోగ్యం పాడైంది. ఈ సమయంలో నాలోని అత్యుత్తమ ఆటను ప్రదర్శించడం అసాధ్యం. ఈ విషయంలో నా బృందంతో చర్చించిన తర్వాత నేను పూర్తి స్థాయిలో రికవరీ అయ్యేదాక రాబోయే టోర్నీల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ కఠిన పరిస్థితులలో నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నేను మళ్లీ బలంగా తిరిగొస్తాను’ అని ప్రణయ్ పేర్కొన్నాడు. కాగా అనారోగ్యం బారిన పడ్డ ప్రణయ్ ఎప్పుడు కోలుకుంటాడు? అనేది మాత్రం స్పష్టతనివ్వలేదు.