న్యూఢిల్లీ: శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో భారత్ ర్యాంకు దిగజారింది. 2025 హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 57 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్ ర్యాంకు 85కి పడిపోయింది. గత ఏడాది 62 దేశాలకు వీసారహిత ప్రయాణ సదుపాయం ఉన్న భారత్ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో 80వ ర్యాంకులో ఉండేది.
193 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ ఉన్న సింగపూర్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా మొదటి ర్యాంకులో ఈ ఏడాది కూడా కొనసాగింది. 190 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్‌తో ద.కొరియా రెండవ ర్యాంకులో, జపాన్ మూడవ ర్యాంకులో ఉంది.