న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ నివసించిన అధికారిక బంగళాకు రూ.1,100 కోట్ల ధర పలికింది. ఇది ఢిల్లీలోని లుటియెన్స్ బంగళా జోన్లో, 17 యార్క్ రోడ్ (ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్)లో ఉంది. రాజస్థాన్‌కు చెందిన రాజ వంశీకులు రాజ్ కుమారి కక్కర్, బీనా రాణీ ఈ బంగళాను విక్రయించారు.
వీరు మొదట రూ.1,400 కోట్లు డిమాండ్ చేశారు. 3.7 ఎకరాల విస్తీర్ణంలో, 24,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో ఈ బంగళా ఉంది. బెవరేజ్ రంగానికి చెందిన ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త దీనిని కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది.