న్యూఢిల్లీ: తొలి స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్, మూడో దశ ట్రయల్స్‌కు బయలుదేరింది. వివిధ పరిస్థితులలో ఈ యుద్ధ నౌక ఎలా పని చేస్తుందో అన్న నిర్దిష్ట రీడింగుల నమోదు, సంక్లిష్టమైన యుక్తులు, సముద్రపు విన్యాసాలను ఇది నిర్వహిస్తుందని భారత నౌకాదళం ఆదివారం తెలిపింది. సామర్ధ్యాలపై విమాన వాహక నౌక విక్రాంత్ తగిన విశ్వాసాన్ని పొందినట్లు పేర్కొంది.
వివిధ పరిస్థితులలో ఈ నౌక ఎలా పని చేస్తుందో అన్నది నిర్ధారించేందుకు, సంక్లిష్టమైన విన్యాసాలకు మూడో దశ ట్రయల్స్ చేపడుతున్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. విశాఖపట్నంలోని డీఆర్డీవో ప్రయోగశాల శాస్త్రవేత్తలు, నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కూడా ట్రయల్స్‌లో పాల్గొంటున్నట్లు తెలిపింది. నౌకలోని వివిధ సెన్సార్ సూట్లను కూడా పరీక్షించనున్నట్లు పేర్కొంది.
కాగా, గత సంవత్సరం ఆగస్టులో చేపట్టిన తొలి దశ ట్రయల్స్‌లో భాగంగా ప్రొపల్షన్, నావిగేషనల్ సూట్, ప్రాథమిక అంశాలను పరీక్షించారు. ఆ తర్వాత అక్టోబరు-నవంబర్‌లో జరిగిన రెండవ సముద్ర ట్రయల్స్‌లో మెషినరీ, ఫ్లైట్ ట్రయల్స్ అంశాలను పరీక్షించారు.
#WATCH | Indigenous Aircraft Carrier INS Vikrant heads out for the next set of sea trials. pic.twitter.com/S1Yt8crcqu
— ANI (@ANI) January 9, 2022