చెన్నై, డిసెంబర్ 31: దేశంలో మొట్టమొదటి గాజు వంతెన తమిళనాడులో ప్రారంభమైంది. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించే ఈ గాజు వంతెనను సోమవారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు.
కన్యాకుమారిలో రూ.37 కోట్లతో 10 మీటర్ల వెడల్పు, 77 మీటర్ల పొడవుతో ఈ వంతెనను ప్రభుత్వం నిర్మించింది. వివేకానంద స్మారక స్థలి నుంచి తిరువళ్లువర్ విగ్రహం వరకు పర్యాటకులు ఈ వంతెన పై నుంచి చేరుకోవచ్చు. ఇంతకుముందు పడవల్లో వెళ్లి వచ్చేవారు.