Indian Troops | మాల్దీవులను భారత సైన్యం వీడాలి: కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ముయిజ్జు
Indian Troops | మాల్దీవులను భారత సైన్యం (Indian Troops) వీడాల్సిన అవసరం ఉందని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తెలిపారు. దీని కోసం భారత్‌తో చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. మాల్దీవులలో భారత ఆర్మీ ఉనికికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన పార్టీ విజయం సాధించింది.
న్యూఢిల్లీ/మాలే: మాల్దీవులను భారత సైన్యం (Indian Troops) వీడాల్సిన అవసరం ఉందని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తెలిపారు. దీని కోసం భారత్‌తో చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. మాల్దీవులలో భారత ఆర్మీ ఉనికికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముయిజ్జు శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమ దేశం నుంచి భారత ఆర్మీ వైదొలగాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, అవి విజయవంతమయ్యాయని తెలిపారు. ‘పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సంబంధాన్ని మేం కోరుకుంటున్నాం. భారతీయ సైనికుల స్థానంలో చైనా లేదా ఇతర దేశాల దళాలు ఉండవు’ అని బ్లూమ్‌బెర్గ్‌తో అన్నారు.
కాగా, హిందూ మహాసముద్రంపై పెత్తనం కోసం భారత్, చైనా మధ్య పోటీ నెలకొన్నది. దీంతో ఇక్కడ కీలకంగా ఉన్న మాల్దీవులలో రెండు దేశాలు పోటాపోటీగా పెట్టుబడులు పెట్టడంతోపాటు ఆ దేశ అభివృద్ధికి భారీగా రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలు భారత్ లేదా చైనా వైపు మొగ్గుచూపుతాయి.
మరోవైపు ఎన్నికల్లో ఓడిన తాజా అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సుమారు 70 మంది భారతీయ సైనికులు మాల్దీవుల్లో ఉన్నారు. భారత్ ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, మోహరించిన నిఘా విమానాలను వారు నిర్వహిస్తున్నారు. అలాగే మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో పెట్రోలింగ్ కోసం భారత యుద్ధనౌకలు కూడా సహకరిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

