ఐఐటీ మండి ఆధ్వర్యంలోని ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఆధారిత యోగా మ్యాట్‌ను కేంద్ర మంత్రులు ఎస్ జయశంకర్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరపున అందజేశారు.
‘యోగిఫై’గా వ్యవహరించే ఈ మ్యాట్ ఇంట్లోనే యోగా అభ్యాసం, శిక్షణను సులభతరం చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా దీని ద్వారా వ్యక్తిగత శిక్షణ పొందవచ్చునని దీనిని అభివృద్ధి చేసిన వెల్నెసీస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది.