న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐఐటీ-ఢిల్లీ సహకారంతో భారతీయ స్టార్టప్ ‘ఆప్టిమిస్ట్’ తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా పనిచేయగల ‘ఎయిర్కండిషనింగ్’ వ్యవస్థను అభివృద్ధి చేసింది. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ సమర్థంగా పనిచేయగల అత్యాధునిక ‘ఏసీ’ని తయారుచేసింది. ఐఐటీ-ఢిల్లీ, పరిశ్రమ వర్గాల భాగస్వామ్యంతో 18 నెలలపాటు సాగిన పరిశోధనల ఫలితంగా దీనిని సాధించినట్టు స్టార్టప్ కంపెనీ పేర్కొన్నది.
ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పైలట్ దశ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసినట్టు తెలిపింది. త్వరలో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నది. 2024లో ఆశీష్ గోయల్, ప్రణవ్ చోప్రా స్థాపించిన ‘ఆప్టిమిస్ట్’, ఇటీవల తన తయారీని విస్తరించడానికి, ఆర్ అండ్ డీని బలోపేతం చేయడానికి 12 మిలియన్ డాలర్లను సమీకరించింది.