Tug of War | న్యూఢిల్లీ, మే 29: ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ దళంగా సూడాన్‌లో ఉన్న భారత సైనికులు.. స్నేహపూర్వకంగా జరిగిన ‘టగ్ ఆఫ్ వార్’ ఆటలో తమ సత్తా చాటాను. చైనా సైనికులను ఓడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను భారత ఆర్మీ అధికారులు కూడా ధ్రువీకరించారు. సూడాన్‌లో శాంతి పరిరక్షణ నిమిత్తం వెళ్లిన భారత్, చైనా సైనికులు స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్ ఆటను ఆడారు.