న్యూఢిల్లీ : నాణ్యమైన ఆహారం దొరకటం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న బేస్ కిచెన్ల స్థానంలో క్లౌడ్ కిచెన్స్ను ఏర్పాటుచేసేందుకు ‘ఐఆర్సీటీసీ’ (ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్) చర్యలు చేపట్టింది.
సీసీటీవీ పర్యవేక్షణ, పాకశాస్త్ర ప్రవీణులు, ఇతర నిపుణుల బృందంతో దాదాపు 200 వరకు ‘క్లౌడ్ కిచెన్ల’ను ఐఆర్సీటీసీ వెస్ట్ జోన్లో ఏర్పాటు చేయబోతున్నారు. తొలుత ముంబైలోని బేస్ కిచెన్స్ను క్లౌడ్ కిచెన్స్గా అప్గ్రేడ్ చేయనున్నట్టు రైల్వే అధికారులు చెప్పారు. ఇకపై వీటి నుంచే రాజధాని, శతాబ్ధి, తేజస్ ఎక్స్ప్రెస్, వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు ఆహారాన్ని అందజేస్తారు.