సోమవారం 01 జూన్ 2020
National - May 22, 2020 , 23:03:34

రైల్వేశాఖ : ఇక‌పై పోస్టాఫీసుల్లో కూడా బుకింగ్‌

రైల్వేశాఖ : ఇక‌పై పోస్టాఫీసుల్లో కూడా బుకింగ్‌

ప్ర‌యాణీకుల‌కు రైల్వేశాఖ మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్‌లో వేరే న‌గ‌రాల్లో చిక్కుకున్న వారిని త‌ర‌లించేందుకు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. టికెట్లు దొర‌క్క ఆందోళ‌న చెందుతున్న వీరికి ఊర‌ట‌నివ్వ‌డానికి రైల్వేశాఖ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. జూన్ 1 నుంచి 200 మంది ప్ర‌యాణీకుల రైళ్ల‌ను న‌డుప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ది. ఈ ప్ర‌యాణానికి కావ‌ల‌సిన టికెట్ల‌ను పోస్టాఫీసులు, యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు, IRCTC ఏజెంట్ల ద్వారా కూడా బుక్ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. మే 12 నుంచి న‌డుస్తున్న రైళ్ల‌ను 7 రోజులు ముందు మాత్ర‌మే బుకింగ్ చేసుకునే స‌దుపాయం ఉంది. తాజాగా వాటికి కూడా 30 రోజులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే స‌దుపాయాన్ని అంటే.. మే 24 నుంచి క‌ల్పించింది.


logo