న్యూఢిల్లీ, మే 18: అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనున్న భారతదేశపు ప్రతిపాదిత బుల్లెట్ రైలు తొలి రూపాన్ని(ఫస్ట్ లుక్) న్యూఢిల్లీలోని రైల్వే శాఖ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఒక అవగాహనను ఇది అందిస్తున్నది. రైల్వే శాఖ ఆఫీస్ గేట్ నంబర్ 4 వద్ద హైస్పీడ్ రైలు ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ ఫోటో రైలు డిజైన్‌ను తెలియచేస్తోంది.
ప్రతిపాదిత బుల్లెట్ రైలు భారత్‌లో మొట్టమొదటి హై-స్పీడ్ రైలు సర్వీసును అందచేయనున్నది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌ను 2027 ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వచ్చాక, ఈ రైలు రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు రెండు గంటలకు తగ్గిస్తుందని అంచనా.