Pamban New Bridge | చాలా మందికి రైల్వే ప్రయాణం అంటే ఎంతో మక్కువ. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఎంతో మధురానుభూతి కలిగిస్తుంది. పంట పొలాలు, నదులు, జలపాతల నుంచి సాగే ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చుట్టూ సముద్రం.. రైలును తాకే అలల మధ్య సాగే ప్రయాణం మరింత అనుభూతిని కలిగిస్తుంది. ప్రమాదకరమైన.. సాహసంతో కూడకున్న రైలు ప్రయాణం మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. తమిళనాడులోని రామేశ్వరం దీవిని.. ప్రధాన భూభాగంతో కలిపే పంబన్ వంతెన మీదుగా ప్రయాణం మాటల్లో వర్ణించలేం.
రామేశ్వరం ద్వీపాన్ని.. ప్రధాన భూభాగంతో కలిపే కొత్త పంబన్ బ్రిడ్జిని కేంద్రం కొత్తగా నిర్మించింది. పాత రైల్వే వంతెన ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. దాని స్థానంలో కొత్తగా రైల్వే వంతెన నిర్మాణం చేపట్టగా.. పూర్తయ్యింది. ఇప్పటికే ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం లేకుండా నౌకలు వెళ్లేలా ఏర్పాటు చేసిన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని తొలిసారిగా సముద్రం మధ్యలో 17 మీటర్ల ఎత్తులో రూ.550 కోట్లతో నిర్మించారు. తమిళనాడులోని రామేశ్వరం మండపం జిల్లా పట్టణం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవికి వెళ్లాలంటే.. కేవలం సముద్ర మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రెండు ప్రాంతాలను సముద్ర మార్గాన్ని లింక్ చేసేలా పంబన్ రైల్వే వంతెనను నిర్మించారు. అవసరానికి అనుగుణంగా లిఫ్ట్ చేసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సిబుల్ బ్రిడ్జి ఇది. దేశంలోనే తొలి వర్టికల్ బ్రిడ్జి ఇది. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఈ రైలు వంతెన నిర్మాణ పనులను 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) వంతెన పనులు చేపట్టింది. దాదాపు నాలుగేళ్లలోనే పనులు పూర్తి చేసింది. వంతెన నిర్మాణంలో ఎక్కడా మిల్లీ మీటర్ తేడా రాకుండా రైల్వేశాఖ పకడ్బందీగా నిర్మాణం చేపట్టింది. వంతెనపై 600 మీటర్ల పరిధిలో భారీ సైజు వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. దాని పనులు పూర్తికావడానికి ఐదు నెలల సమయం పట్టింది. ఈ లిఫ్ట్ బరువు 660 టన్నులు కాగా.. పొడువు 72.5 మీటర్లు ఉంటుంది. పాంబన్ వంతెన సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద నుంచి ఓడలు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. వంతెనకు రెండువైపులా భారీ స్తంభాలుంటాయి. వాటికి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి. వాటి బరువు 625 టన్నులు ఉంటుంది.
పంబన్ వంతనపై ఉండే వర్టికల్ లిఫ్ట్‌లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం అవుతుంది. వంతెనను ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్‌లు, మోటార్ల సాయంతో పైకి లేస్తుంది. అయితే, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నది. పంబన్ సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకూ 25-35 మీటర్ల లోతున పునాదులు నిర్మించారు. ప్రపంచంలోనే ఎక్కువగా తుప్పు పట్టే రెండో ప్రాంతంగా పంబన్ ప్రాంతానికి పేరుంది. సముద్రం అలలు పంబన్ వంతెనపైకి వస్తాయి. దాంతో ఇనుము పట్టాలు తప్పుపడుతుంటాయి. అయితే, దాదాపు 104 సంవత్సరాల కిందట నిర్మించిన పంబన్ వంతెన ఇనుము తుప్పు పట్టింది.
కొత్త వంతెనకు తుప్పు సమస్య రాకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్ పెయింట్ వేశారు. దాంతో దాదాపు 58 సంవత్సరాల వరకు తుప్పు ముప్పు ఉండదు. చిన్న చిన్న మరమ్మతులు చేస్తే వందేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సముద్రంలో వేసిన దిమ్మెలకు ఇబ్బంది కలుగకుండా కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిలో ఒక బోల్డును వాడకపోడం విశేషం. వెల్డింగ్‌తోనే జోడించారు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేయగా.. గంటకు 58 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తే స్కాడా సెన్సర్లు ఆటోమేటిక్‌గా వంతెనను మూసివేస్తాయి. మత్స్యకారుల పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చిన సమయంలో సిబ్బంది దిమ్మెల వద్ద ఏర్పాటు చేసిన గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తుంటారు.
Saif Ali Khan | చిక్కుల్లో సైఫ్ వేల కోట్ల ఆస్తులు.. ప్రభుత్వ పరం కానున్న 15 వేల కోట్ల ఆస్తులు?
Maoist Chalapati | మావోయిస్టు అగ్రనేతను పట్టించిన సెల్ఫీ