Lok Sabha Elections | న్యూఢిల్లీ: తాజా లోక్ సభ ఎన్నికల్లో పాతికేళ్ల వయసులోనే ఎంపీలుగా విజయం సాధించినవారిగా పుష్పేంద్ర సరోజ్, ప్రియ సరోజ్ (సమాజ్‌వాదీ పార్టీ), శాంభవి చౌదరి (ఎల్జేపీ), సంజన జాతవ్ (కాంగ్రెస్) గుర్తింపు పొందారు. శాంభవి చౌదరి బీహార్ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె. ఆమె సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
సంజన జాతవ్ రాజస్థాన్‌లోని భరత్పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఇందర్జిత్ సరోజ్ కుమారుడు పుష్పేంద్ర సరోజ్ కౌశాంబి నుంచి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై విజయం సాధించారు. ప్రియ సరోజ్ మచిలిశహర్ నుంచి గెలిచారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ మూడుసార్లు ఎంపీగా పని చేశారు.