న్యూఢిల్లీ, డిసెంబర్ 31: యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమాలో ఆదివారం ఓ తేలికపాటి విమానానికి జరిగిన ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌తోసహా ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్టు పౌర విమాన యాన సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత సంతతికి చెందిన 26 ఏళ్ల వైద్యుడు సులేమాన్ అల్ మజీద్ కో-పైలట్‌గా వ్యవహరిస్తుండగా పాకిస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల యువతి పైలట్‌గా ఆ తేలికపాటి విమానాన్ని నడుపుతున్నారు. యూఏఈలో పుట్టి పెరిగిన సులేమాన్ సైట్‌సీయింగ్ కోసం తన కుటుంబంతో కలసి విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే బీచ్ వెంబడి ఉన్న కోవ్ రొటానా హోట్ సమీపంలో విమానం కూలిపోయింది.