న్యూఢిల్లీ: మిస్సైల్ సామర్థ్యం కలిగిన యుద్ధనౌక ఐఎన్ఎస్ తమల్(INS Tamal)ను ఇవాళ జలప్రవేశం చేయనున్నారు. భారతీయ నౌకాదళం కోసం దీన్ని నిర్మించారు. రష్యాలోని కాలినిన్గ్రాడ్లో జలప్రవేశం వేడుకను నిర్వహిస్తున్నారు. సుమారు 125 మీటర్ల పొడుగు, 3900 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌకను.. వెస్ట్రన్ నావల్ కమాండ్‌లో మోహరించనున్నారు. ఆరేబియా సముద్రంతో పాటు పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఈ యుద్ధనౌక పహారా కాయనున్నది.
ఐఎన్ఎస్ తమల్‌ను విదేశాల్లో నిర్మిస్తున్నారు. దీంట్లో 26 శాతం దేశీయ సిస్టమ్స్ ఉన్నాయి. దీనికి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ సామర్థ్యం కూడా ఉంది. ఈ యుద్ధనౌకలో ప్రత్యేకమైన ఎస్హెచ్టీఐఎల్ వెర్టికల్ లాంచ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నది. షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ లాంచ్ చేసే సామర్థ్యం ఉన్నది. మధ్యశ్రేణి సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కూడా ఉంది. ఈ రెండు వ్యవస్థలతో .. క్రూయిజ్ మిస్సైళ్లు, హెలికాప్టర్లు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవచ్చు.
Crafted to Conquer; Engineered to Endure.⚓
Every weld. Every test. Every challenge overcome.
Witness the formidable journey of #INSTamal — from blueprint to battleship.Commissioning Soon
🗓️ 01 July 2025#IndianNavy #CombatReady@IndianNavy @IN_WNC @IN_HQENC @IN_HQSNC pic.twitter.com/uqLXbfUWwn— IN (@IndiannavyMedia) June 28, 2025
యుద్ధ నౌకలోఏ-190-01 100ఎంఎం నావల్ గన్ ఉన్నది. చాలా కచ్చితత్వంతో ఆ ఆర్టిల్లరీ సిస్టమ్ పనిచేయనున్నది. గతంలో ఉన్న నావెల్ గన్స్‌తో పోలిస్తే, దీని అక్యురెసి అద్భుతంగా ఉంది. ఏకే-630 30ఎంఎం క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, యాంటీ షిప్ మిస్సైళ్లను ఇది పేల్చి వేస్తుంది. సీఐడబ్ల్యూఎస్ వెపన్ నిమిషానికి 5 వేల రౌండ్లు పేల్చగలదు.
మిస్సైల్ ఫ్రిగేట్.. వైమానిక దాడుల్ని తిప్పికొట్టగలదు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌లో కీలకమైన కమోవ్-28 దీంట్లో ఉంది. ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ మిషన్‌కు చెందిన అత్యాధునిక కమోవ్-31 సిస్టమ్ కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సుమారు 250 మంది సిబ్బంది ఐఎన్ఎస్ తమల్లో విధులు నిర్వర్తిస్తారు. వాళ్లంతా సెయింట్ పీటర్స్బర్గ్, కాలినిన్గ్రాడ్లో శిక్షణ పొందారు. కోల్డ్ వెదర్, హై సీ కంబాట్ పరిస్థితుల్లో శిక్షణ తీసుకున్నారు. యుద్ధ నౌకకు సముద్రంలో మూడు నెలల పాటు ట్రయల్స్ నిర్వహించారు. దాంట్లో ఉన్న ఆయుధాలు, సెన్సార్లు, ఆన్‌బోర్డ్ సిస్టమ్‌లను పరీక్షించారు. తుశిల్ క్లాస్‌కు చెందిన ఫ్రిగేట్లలో.. ఐఎన్ఎస్ తమల్ రెండోది. నాలుగు స్టీల్త్ యుద్ధనౌకలను నిర్మించేందుకు ఇండియాతో రష్యా ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 21 వేల కోట్లతో 2016లో ఆ ఒప్పందం కుదిరింది.